సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2021లో ఈసినిమా రిలీజ్ అయింది. 2022 లో కూడా అల్లు అర్జున్ ఈసినిమా కోసం వెయిట్ చేస్తూ మరో సినిమా కూడా చేయలేదు. ఏడాది పాటుగా ఈసినిమా కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఈసినిమా కోసం ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈమధ్యనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కొన్నిరోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఇక మరో షెడ్యూల్ ను కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రష్మిక తను ఫిబ్రవరి నుంచి పుష్ప-2 సెట్స్ లో జాయిన్ అవుతానని స్పష్టం చేసింది. ఇక ఈసినిమా వైజాగ్ లో షూటింగ్ ను మొదలుపెట్టను్నట్టు తెలుస్తుంది. పది రోజుల పాటు వైజాగ్‌లో షూటింగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
తొలి పార్ట్ పుష్ప ది రైజ్‌లో ఎర్ర చందనం స్మగ్లర్ ఎలా సిండికేట్ లీడర్‌గా ఎదిగాడడు అన్నది చూపించారు. అలానే పార్ట్ వన్‌లో మెయిన్ విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ను పరిచయం చేశారు. రెండో పార్ట్ లో పుష్పరాజ్ కు భన్వర్ సింగ్ కు మధ్య ఎలాంటి గొడవ జరిగిందనేది చూపించనున్నట్టు తెలుస్తుంది.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: