ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 94 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన అఖండ మూవీ హిందీ వెర్షన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ పెన్ స్టూడియోస్ ద్వారా జనవరి 20 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిందీ ఆడియెన్స్ మాస్, యాక్షన్ సినిమాలను బాగా ఆదరిస్తున్న విషయం తెలిసిందే. అఖండ మూవీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ సాధించే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: