స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరల్డ్ వైడ్‌గా ఆర్ఆర్ఆర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మరోసారి ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 20న మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ను బుధవారం నుంచి ఓపెన్ చేశారు. ప్రస్తుతం బుక్ మై షో యాప్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ దేవి థియేటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు.. ఐదు రోజుల పాటు ఈ సినిమా స్క్రీనింగ్ ఉండబోతున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: