మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకే అటు మేకర్స్ ఇటు చిరు ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇంకా బాస్ పార్టీ అనే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో దానికి సంబంధించి చిన్న లీక్ కూడా ఇచ్చారు చిరు. ఈ పాట షూటింగ్ కు సంబంధించి అక్కడ లొకేషన్స్ కు సంబంధించి చిన్న వీడియోను రిలీజ్ చేస్తూ దానిలో భాగంగానే నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా అన్న పాటను లీక్ చేశారు. ఇలా పలురకాలుగా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లకు ఈపోస్టర్ కాస్త భిన్నంగానే ఉంది. ఈ పోస్టర్లో చుట్టూ గన్స్.. చేతికి సంకెళ్లు ఉండగా అటు క్లాసీ గా కనిపిస్తూనే మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు చిరు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























