మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ ను రెండు నెలల ముందుగానే చిత్ర యూనిట్ ప్రారంభిస్తుంది. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే చిత్ర యూనిట్ ఆదివారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ లో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేసిన ఈ పాటను నవంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ బాస్ పార్టీ పాటకు చిరంజీవి డ్యాన్స్‌లతో పాటు ఊర్వశి రౌతేలా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిరంజీవి మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. లుంగీ ధరించి పూలచొక్కాలో చిరంజీవి కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































