విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్దంగా ఉన్నాడు. తేజ సజ్జా హీరోగా ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాంబిరెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వగా ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ అయితే సినిమాపై మంచి అంచనాలను పెంచేస్తుంది. అతీంద్రియ శక్తులతో పోరాడే ఓ యువకుడిగా తేజ సజ్జా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. హనుమాన్ అండతో సాధారణ యువకుడు మహాశక్తిశాలిగా మారి శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలో చూపించబోతున్నట్లుగా టీజర్ చేస్తే తెలుస్తోంది. తేజా సజ్జాపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ తో మరోసారి ప్రశాంత్ వర్మ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసినిమాలో ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చూద్దాం సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది.
The Ancients Shall Rise Again✊
Taking you all into a whole new surreal world of #HanuMan 💪#HanuManTeaser OUT NOW❤️🔥
– https://t.co/euGU07T7Ha🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #PVCU#SuperHeroHanuMan pic.twitter.com/QCcSNvx1Nu
— Prasanth Varma (@PrasanthVarma) November 21, 2022
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: