రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఒకవైపు కె.జి.యఫ్ డైరెక్టర్ మరోవైపు ప్రభాస్ హీరో కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా మేకర్స్ ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓ భారీ సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ ను ప్లాన్ చేశారట. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ మరో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























