శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవర్సీస్ లో అద్భుత స్పందన తోవన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 12కోట్లకుపైగా జరిగినట్లు సమాచారం. గురువారం నాటి కే ఈ సినిమా పన్నెండున్నర కోట్లకుపైగా షేర్‌ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.తాజాగా యశోద సక్సెస్ పై సమంత స్పందిస్తూ ఓ లెటర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియమైన ప్రేక్షకులారా, యశోద పట్ల మీ ప్రశంసలు మరియు ప్రేమ తన కు గొప్ప బహుమతి మరియు మద్దతు ఇచ్చిందనీ , ఆనందం, కృతజ్ఞతతో పొంగిపోయాననీ , ఈ ఆనందంతో మేఘాలలో విహరిస్తున్నాననీ , యశోద మేకింగ్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ , నిర్మాత , దర్శకులకు కృతజ్ఞతలనీ , ప్రియమైన సహనటులు వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, ఉన్ని ముకుందన్ గారు మరియు మిగిలిన అద్భుతమైన నటీనటులకు కూడా మీతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందనీ, వినయంగా మరియు ఎప్పుడూ కృతజ్ఞతతో.. ప్రేమతో.. సమంత అంటూ సమంత ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: