హరి అండ్ హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. సరోగసీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతుంది. నిజానికి ఇప్పటికే సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసింది. అవి కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె నటించిన ఓ బేబి సినిమాలో తన నటనకు బాగా విమర్శకులు ప్రశంసలు సైతం దక్కాయి. దాంతో ఈసినిమాపై కూడా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను ఏ మాత్రం నిరాశపరచలేదు సమంత. ఈసినిమాలో సమంత పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ వారం యశోద ఒక్కటే బిగ్ మూవీ కావడంతో ఈ సినిమాకు కలిసొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టుకుంటుంది. మొదటి షో నుండే ఈసినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. ఇక తాజాగా ఈసినిమా యూఎస్ లో 4 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసింది. దీనితో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ కి అతి చేరువకు చేరింది. ఇక మరో రోజుతో హాఫ్ మిలియన్ చేరుకోవడం ఖాయం.

కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























