వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వరిసు. ఈసినిమా డైరెక్ట్ తమిళ్ లో చిత్రీకరణ జరుగుతుంది. తెలుగులో డబ్బింగ్ లోనే రిలీజ్ కాబోతుందని ఇటీవలే వంశీ పైడిపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. తెలుగులో వారసుడు టైటిల్ తో రాబోతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా విజయ్-రష్మిక ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈపాటకు సంబంధించిన ప్రోమోను ను కూడా రిలీజ్ చేశారు. రంజితమే అంటూ వచ్చిన ఈ ప్రోమోనే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు. హుషారుగా సాగే ఈ బీట్ కి విజయ్ ఒక రేంజ్ లో స్టెప్స్ వేశాడని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్ ను స్కోర్ చేశారు. ఎమ్ ఎమ్ మానసితో కలిసి విజయ్ స్వయంగా హై బీట్, ఎనర్జిటిక్ గా పాడటం అద్భుతంగా వుంది. విన్న వెంటనే ఉత్సాహాన్ని పెంచుతోంది. విజయ్ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది. వివేక్ సాహిత్యం అందించారు.
విజయ్, జానీ మాస్టర్‌ల కాంబినేషన్ సూపర్ హిట్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు.
#Ranjithame is all yours now 🤩
Lyric video ▶️ https://t.co/pfJ3GAAymT
🎙️ #Thalapathy @actorvijay sir & @manasimm
🖊️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries
#Varisu #VarisuPongal— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2022
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























