మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చిన అల్లు శిరీష్ కు మంచి హిట్ దక్కింది. అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న ఒక్క రోజే అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ పోటీని తట్టుకొని ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రోషన్స్ ను చేసుకోబోతున్నారు చిత్రయూనిట్. మాములుగా కాదు దీనికోసం ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు. యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ జేఆర్సీ కన్వెన్షన్ లో రేపు సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ జరగనుంది. ఇక ఈకార్యక్రమానికి శిరీష్ అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అనందంగా తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
కాగా రాకేష్ శశి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఆమని, సునీల్, వెన్నెల కిశోర్, పోసాని పలు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలుసంయుక్తంగా కలిసి సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: