ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో రకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. కొత్త కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ అయింది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తుంది. ముగ్గురూ కలసి ఉన్న పిక్ కూడా బయటికి రావడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవ్వనుంది. ఒక పాన్ ఇండియా చిత్రం కోసం వీరు ముగ్గురూ వర్క్ చేయనున్నారట. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు.. సుకుమార్ డైరెక్ట్ చేస్తారా లేక స్క్రిప్ట్ అందిస్తారా.. వివేక్ డైరెక్ట్ చేస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ 2 వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు. దీంతో ఇప్పటినుండో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది.
సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమా నార్త్ లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయి వచ్చే నెలకి ఏడాది అవ్వబోతున్నా కూడా ఇంకా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈసినిమా కోసం సాలిడ్ స్క్రిప్ట్ ను తయారు చేయడానికే ఇంత సమయం సుకుమార్ తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ కు సిద్దమవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























