ఒకప్పుడు ఇండస్ట్రీల్లో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎవరికి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్లి తన సత్తాను నిరూపించుకుంటున్నారు. దీనిలోభాగంగానే ఇన్నాళ్లు తమిళ్ హీరోలు తన సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి హీరోల్లో శివకార్తికేయన్ కూడా ఉన్నారు. శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈనేపథ్యంలో ఈ ఈవెంట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. “ఈ ఫంక్షన్ కి విజయ్ దేవరకొండ రావడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన ‘గీత గోవిందం’ సినిమాను నేను చాలాసార్లు చూశాను. నా జర్నీ ట్రైన్ జర్నీలా కొనసాగుతూ వచ్చింది. పికప్ అందుకునేలోగా స్టేషన్ వచ్చినట్టు సాగుతుంది.. కానీ విజయ్ దేవరకొండ జర్నీ అలా కాదు, ఆయన ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోయాడు. ఆయన జర్నీ నాకు స్ఫూర్తి. అలాంటి ఆయనతో కలిసి త్వరలో ఒక సినిమా చేయాలనుంది” అని అన్నాడు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో..
కాగా ఈసినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































