సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. అంతా అనుకున్నట్లు జరిగితే జిన్నా చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచన చేస్తానని మంచు విష్ణు ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలిపారు. జిన్నా విజయం పై తనకు పూర్తి నమ్మకం ఉందని కూడా అన్నారు. మరి మంచు విష్ణు పెట్టుకున్న నమ్మకాన్ని ఈసినిమా ఎంతవరకూ నిజం చేస్తుందో చూద్దాం.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: