సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్

Nagarjuna speech at Sardar Pre Release Event, Sardar Pre Release Event, Sardar Movie Pre Release Event, Sardar Telugu Movie Pre Release Event, Akkineni Nagarjuna, Nagarjuna speech, Karthi, Laila, Raashii Khanna, Rajisha Vijayan, PS Mithran, Sardar, Sardar 2022, Sardar Update, Sardar Telugu movie, Sardar New Update, Sardar Telugu Movie New Update, Sardar Movie, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie Latest News, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సర్ధార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరిగింది. కింగ్ అక్కినేని నాగార్జున మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. నాగార్జున మాట్లాడుతూ… కార్తి తో కలిసి ఊపిరి సినిమా చేసిన ఎక్స్ పీరియన్స్ ను తాను ఎప్పటికీ మర్చిపోననీ , తన అన్నయ్య సూర్య ఒక పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా బయటకు వచ్చి తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకుని ప్రస్తుతం కార్తి కూడా స్టార్ హీరోగా ఎదిగి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారనీ , తెలుగులో చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ వంటి వారు కూడా అదే తరహాలో గొప్ప పేరు అందుకున్నారనీ చెప్పారు. పవన్ కళ్యాణ్ , పునీత్ రాజ్ కుమార్ తో హీరో కార్తి ని నాగార్జున పోల్చడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − thirteen =