తమిళ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు ‘చియాన్’ విక్రమ్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఆయన నటించిన ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ సినిమాలనే ఉదాహరణగా చెప్పొచ్చు. 1990లో ఎన్ కాదల్ కమ్మని సినిమాతో సినీ కెరీర్ ను మొదలుపెట్టాడు విక్రమ్. సేతు సినిమాతో మంచి హిట్ అందుకున్న విక్రమ్ ఆ తరువాత వెనుదిగిరి చూసుకోవాల్సిన పరిస్థితిలేదు. విక్రమ్ కు తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు విక్రమ్. ఇక రీసెంట్ గా వచ్చిన కోబ్రా సినిమాలో అయితే ఏకంగా 20 వరకూ గెటప్స్ తో వచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విక్రమ్ సినీ కెరీర్ మొదలై 32 ఏళ్లు పూర్తయిపోయింది. ఈనేపథ్యంలో విక్రమ్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ 32 సంవత్సరాలు ఎన్నో కలలు, ఎన్నో ప్రయత్నాల సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. మీరు లేకపోతే ఇవన్నీ ప్రయత్నాలు, కలలుగానే మిగిలేవి. ఈ 32 ఏళ్లకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ఇక మరోవైరు అభిమానులు తమ అభిమాన హీరో 32 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో విక్రమ్ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈఏడాది కోబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్. ఆతరువాత వచ్చిన పొన్నియన్ సెల్వన్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ 61 వ సినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే లాంఛ్ అయింది. ప్రస్తుతం ఈసినిమాను మొదలుపెట్టేపనిలో ఉన్నారు. నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై రాబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























