వారసుడు ఫస్ట్ సింగిల్ పై థమన్ క్రేజీ అప్ డేట్

vijay varasudu first single on diwali, varasudu first single on diwali, vijay varasudu first single, Thalapathy VIjay, Rashmika Mandanna, Vamshi Paidipally, VIjay Latest Movie, VIjay's Upcoming Movie, varasudu, varasudu Telugu movie, varasudu New Update, varasudu Telugu Movie New Update, varasudu Movie, varasudu Latest Update, varasudu Movie Updates, varasudu Telugu Movie Live Updates, varasudu Telugu Movie Latest News, varasudu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఈఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వచ్చేస్తున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అదే నిజం అని కన్ఫామ్ చేశాడు థమన్. నిన్న ప్రిన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈకార్యక్రమంలో థమన్ కూడా పాల్గొన్నాడు. ఈనేపథ్యంలో ఆయన వారసుడు సినిమా గురించి మాట్లాడుతూ.. వారసుడు ఫస్ట్ సాంగ్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ అప్ డేట్ తో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.