టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకపక్క లవర్ బాయ్ పాత్రలు చేస్తూనే మరోపక్క సెటిల్ట్ క్యారెక్టర్స్ లలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇటీవలే అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు తమిళంలో డైరెక్ట్ చేసిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్‌గా ఓరి దేవుడా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మరో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీపావళి దావత్ పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. దీనికి వేదికను కూడా ఖరారు చేశారు. హైదరాబాద్ .. మాదాపూర్ లోని ‘దసపల్లా కన్వెన్షన్’ లో రేపు ఈ వేడుక జరగనుందని అధికారిక ప్రకటన చేశారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది.
కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈసినిమా తెలుగులో ఏమాత్రం హిట్ అవుతుందో చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: