రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ సందీప్ ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ తో టెర్రిఫిక్ గా ఉన్న సందీప్ లుక్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 20వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మరో అప్ డేట్ డేట్ ఇచ్చారు చిత్రబృందం. ఈసినిమా మలయాళం ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Everybody’s Fav,The incredibly talented @dulQuer to launch the Malayalam Teaser of @sundeepkishan’s #MICHAEL👊🏾#MichaelTeaser Tomorrow
A @jeranjit film@VijaySethuOffl @itsdivyanshak @menongautham @varusarath5 @SamCSmusic @SVCLLP @KaranCoffl pic.twitter.com/Jh1NjNpmt5
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) October 19, 2022
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: