ఆదిపురుష్ టీజర్-వరల్డ్ వైడ్ సూపర్ రెస్పాన్స్

sensational response for adipurush movie teaser world wide, adipurush movie teaser world wide response, adipurush teaser world wide response, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush, Adipurush Telugu movie, Adipurush New Update, Adipurush Telugu Movie New Update, Adipurush Movie, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie Latest News, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

లేట్ గా వచ్చినా కూడా రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఈసినిమాకు వీఎఫ్ఎక్స్ కీలకం కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పట్టనుంది. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ దసరా పండుగ సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికీ వ్యూస్ ను సొంతంచేసుకుంటూనే ఉంది. అంతేకాదు నార్త్ లో ఈసినిమా టీజర్ ఇప్పటికే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈటీజర్ ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ వచ్చిన 24 గంటల్లో యూట్యూబ్ నుంచి ఈ టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. 24 గంటల్లో అయితే ఈ సినిమా టీజర్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతంచేసుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కూడా ఈసినిమా రికార్డును సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా మైథలాజికల్ సినిమాగా ఈసినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12వ తేదీన రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.