చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ద్వారక నేపథ్యంలో కృష్ణుని కంకణం కథాంశం ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్ అడియెన్స్‌కు కూడా నచ్చేసింది. నచ్చడమే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటి సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కార్తికేయ2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కార్తికేయ3 కూడా చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు కూడా. అసలు కార్తికేయ2 ప్రమోషన్స్ అప్పుడే చందూ మొండేటి ఇంకా నిఖిల్ కూడా కార్తికేయ3 ఉంటుందని చెప్పారు. కార్తికేయ2 ఇచ్చిన బూస్ట్ తో మరీ ఆలస్యం కాకుండా సినిమా ను ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ 3 గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. కార్తికేయ, కార్తికేయ2 సినిమాలను ఆడియన్స్ ఆదరించారు.. ఆ నమ్మకంతోనే కార్తికేయ3 సినిమాను కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నాం.. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామా? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామా?అని చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే మూడో పార్ట్‌ను 3Dలో రూపొందించనున్నారు’ అని చెప్పకొచ్చాడు నిఖిల్. మరి చూద్దాం మూడో పార్ట్ ఎంత మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో.
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: