గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు నిర్మాతల సమావేశంలో షూటింగ్స్ ప్రారంభం , థియేటర్స్ సమస్యలు , ఓటీటీ స్ట్రీమింగ్ , నిర్మాణ వ్యయం, రేట్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. అగ్ర నిర్మాత ఈ సందర్భంగా మాట్లాడుతూ .. షూటింగ్స్ ఎప్పుడు పునఃప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, రాబోవు రెండుమూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనీ ,
ఇక నుంచి విడుదలయ్యే సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్ణయం తీసుకున్నామనీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థియేటర్లో రిలీజైన 50 నుంచి 60రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తాయనీ , ఈ విషయంలో నిర్మాతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారనీ , థియేటర్, మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్, బేవరేజెస్ ధరల విషయంలో వాటి యాజమాన్యాలతో మాట్లాడామనీ , తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారనీ , మల్టీప్లెక్స్, సింగిల్స్క్రీన్స్లో టికెట్ ధరలు తగ్గించడానికి కూడా అంగీకరించారనీ , అయితే వీపీఎఫ్ ఛార్జీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ , శుక్రవారం ఎగ్జిబిటర్స్‌తో సమావేశం నిర్వహించి తుది నిర్ణయాల్ని ప్రకటిస్తామనీ , నిర్మాణ వ్యయం విషయంలో మా (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)తో ఓ ఒప్పందం చేసుకున్నామనీ , ఫెడరేషన్తో కూడా చర్చలు పూర్తయ్యాయనీ , వాళ్లు కోరుతున్న వేతనాల్ని చెల్లించేందుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారనీ , షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని తదుపరి సమావేశాల్లో నిర్ణయిస్తామనీ దిల్ రాజు చెప్పారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























