మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్ ‘ సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే చిరు కూడా తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి చిరు పుట్టినరోజు ఆగష్ట్ 22వ తేదీ అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఒకరోజు ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. అంతేకాదు చిరంజీవి, సల్మాన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































