తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “దసరా”(తెలుగు ), “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన “సూరారైపొట్రు” (ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ ఐదు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుధా కొంగర ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక అయినట్టు , ఈ మూవీ తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ కానున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: