మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ

Catherine Tresa, Krithi Shetty, M.S Raja Shekhar Reddy, Macherla Niyojakavargam, Macherla Niyojakavargam – Telugu Movie Reviews, Macherla Niyojakavargam (2022 film), Macherla Niyojakavargam (2022), Macherla Niyojakavargam (2022) – Movie, Macherla Niyojakavargam (film), Macherla Niyojakavargam Cast And Crew, Macherla Niyojakavargam Movie, Macherla Niyojakavargam Movie (2022), Macherla Niyojakavargam movie First Review out, Macherla Niyojakavargam Movie Highlights, Macherla Niyojakavargam Movie Latest News, Macherla Niyojakavargam Movie Plus Points, Macherla Niyojakavargam Movie Public Response, Macherla Niyojakavargam Movie Public Talk, Macherla Niyojakavargam Movie Rating, Macherla Niyojakavargam Movie Review, Macherla Niyojakavargam Movie Review 2022, Macherla Niyojakavargam Movie Review And Rating, Macherla Niyojakavargam Movie Review Telugu, Macherla Niyojakavargam Movie Updates, Macherla Niyojakavargam Review, Macherla Niyojakavargam Review 2022, Macherla Niyojakavargam Review And Rating, Macherla Niyojakavargam Telugu Movie, Macherla Niyojakavargam Telugu Movie 2022, Macherla Niyojakavargam Telugu Movie Latest News, Macherla Niyojakavargam Telugu Movie Live Updates, Macherla Niyojakavargam Telugu Movie Review, Macherla Niyojakavargam Telugu Movie Updates, Macherla Niyojakavargam Telugu Review, Mahathi Swara Sagar, Nithiin

ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈసినిమాలో మొదటిసారి నితిన్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి మరి నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థెరిసా, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
డైరెక్టర్.. ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి
బ్యానర్.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్
నిర్మాతలు.. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీతం.. మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫి.. ప్రసాద్ మూరెళ్ల

కథ..

రాజప్ప (సముద్రఖని) మాచర్ల నియోజకవర్గం లో ఓటమి ఎరుగని పొలిటీషియన్. తనకు పోటీగా వచ్చిన వారిని అడ్డుతప్పించి అసలు పోటీనే లేకుండా ఎలక్షన్స్ లో గెలుస్తుంటాడు. మరోవైపు సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ టాపర్. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తున్న సిద్దార్థ్ రెడ్డి ఒకరోజు స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. ఇలా సాగుతుండగా రాజప్ప మనుషులు స్వాతిని చంపడానికి ట్రై చేస్తారు. అసలు రాజప్ప మనుషులు స్వాతిని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు.. రాజప్పకు, స్వాతికి ఉన్న సంబంధం ఏంటి..? ఆ తర్వాత గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎలా జరిపించాడు ? రాజప్ప రాజకీయ వ్యూహాలు ఎలా తిప్పికొట్టాడు.. అన్నది మిగిలిన కథ

విశ్లేషణ..

ప్రస్తుత రాజకీయ నేపథ్యాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. రాజకీయ నాయకుల ప్రభావం ప్రభుత్వ ఉద్యోగులపై ఎలా ఉంటుందో కూడా పలు సినిమాల్లో చూపించారు ఇప్పటికే. ఈసినిమా కూడా నేటి రాజకీయ పరిస్ధితుల ఆధారంగా తెర కెక్కించాడు డైరెక్టర్ రాజశేఖర్. ఇక ఫస్ట్ సినిమా అయినా కూడా రాజశేఖర్ రెడ్డి సినిమాను డీల్ చేసిన విధానం బాగుంది. ఫ్యాన్స్ తప్పకుండా తమ హీరో నుండి ఎలివేషన్స్ ను కోరుకుంటారు కాబట్టి.. అలాంటివి కొన్ని యాడ్ చేసుకున్నాడు డైరెక్టర్. నితిన్ ని తన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో..అలా మార్చేసి..అభిమానులకు దగ్గరైయేలా చేసాడు.

ఇక గత ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేశాడు. అయితే వాటిలో మాస్ట్రో కాస్త అలరించింది. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పటి వరకు చేయని ఢిఫరెంట్ కాన్ సెప్ట్ తో నితిన్ జనాల ముందుకు వచ్చాడు. ప్రతి సినిమాలో యంగ్ లవర్ బాయ్ గా కనిపించే ఈయన ఈ సినిమాలో ప్రభుత్వ ఆఫీసర్ గా నటించాడు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే నితిన్… ఈసారి కంప్లీట్ గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్ యాక్ష‌న్ రోల్‌ లోకి వచ్చేశాడు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర అంటే పెద్దగా హడావుడి ఉండకూడదు.. సెటిల్డ్ గా నటిస్తూనే మాస్ యాంగిల్ ను చూపించాలి. ఈపాత్రలో నితిన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు

సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రాండ్ స్కోర్ బాగుంది. సొంతబ్యానర్ కాబట్టి నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్న విషయం అర్థమవుతుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లు ఇష్టపడే వాళ్లకి, ఫ్యాన్స్ కు ఈసినిమా నచ్చుతుంది. మిగిలిన వాళ్లు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here