పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. శ్రీకృష్ణుడి జీవితం అంటే కచ్చితంగా మన దగ్గర కంటే నార్త్ లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ఈ సినిమాకు ఇస్కాన్ సంస్థల నుంచి కావాల్సినంత సపోర్ట్ ఉంది.ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలోని బృందావన్ కి వెళ్లి తమ సినిమాను “కార్తికేయ 2” చిత్ర యూనిట్ ప్రమోట్ చేసుకున్న విషయం తెలిసిందే. “కార్తికేయ 2” మూవీని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























