‘లాల్ సింగ్ చడ్డా’ అమీర్ రోల్ రిలీజ్ చేసిన చిరు

Aamir Khan look from Laal Singh Chaddha Released by Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laal Singh Chaddha,Laal Singh Chaddha Movie,Laal Singh Chaddha Hindi Movie,Laal Singh Chaddha Bollywood Movie,Laal Singh Chaddha Movie Updates,Laal Singh Chaddha Latest News, Laal Singh Chaddha latest News,Amir Khan Look From Laal Singh Chaddha,Chiranjeevi Revealed Amir Khan Look From Laal Singh Chaddha,Mega Star Chiranjeevi,Chranjeevi Latest Updates, Chiranjeevi About Laal Singh Chaddha Movie,Chiranjeevi About Naga Chaitanya,Chiranjeevi about Amir Khan,Amir Kkhan latest Look From Laal Singh Chaddha

అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఇక ఈసినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నాగచైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తెలుగులో కూడా ప్రమోషన్స్ పై జోరుగా మొదలుపెట్టారు. ఇటీవలే అమీర్ ఖాన్ చిరుతో, నాగార్జునతో పాటు పలువురికి ప్రివ్యూ షోలు కూడా వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ఈసినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో చిరు కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న ఈసినిమాలో నటిస్తున్న నాగ చైతన్య కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. లాల్ సింగ్ చడ్డా నుండి నాగ చైతన్య లుక్ రివీల్ చేశారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా చైతూ లుక్ లాంఛ్ చేశారు. స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ”లాల్ సింగ్ చడ్డా చడ్డీ బడ్డీ బాలరాజును మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి బాలరాజు మనవడు అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు…” అంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా అమీర్ ఖాన్ కు సంబంధించిన పాత్రను రివీల్ చేశారు. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లాల్ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =