‘నయన్ 75’ మూవీ అనౌన్స్ మెంట్..!

Nayanatara 75 Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nayanatara,Actress Nayanatara,Nayanatara latest Movie Updates,Nayanatara Upcoming Movies,Nayanatara 75th movie Updates, Nayanatara 75th movie Announced,Nayanatara Signed her 75th Movie,Nayanatara Movie latest Updates,Nayanatara New Movie Updates, Nayanatara 75th Movie Latest News,Nayanatara 75th Movie with Director,Nayan75 Movie Annoucement,Nayanatara With Chiranjeevi in Godfather Movie, Nayanatara God Father Movie Updates,Nayanatara in Jawan Movie with ShahRukh khan,Nayanatara in Bollywood Movies,Director Nilesh Krishna Movie with Nayanthara Nayan75 Movie

ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించిన నయనతార ఇప్పుడు లేడీ గా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక పక్క హీరోల పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇక రీసెంట్ గానే కతు వాకుల రెండు కాదల్ సినమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు తెలుగు లో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇక అట్లీ-షారుక్ కాంబినేషన్ లో వస్తున్న జవాన్ సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా తమిళ్ లో పలు ప్రాజెక్ట్ లలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు నయన్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ సినిమాకు సంబంధించిన ప్రకటన నేడు వచ్చేసింది. నయన్ 75 మూవీ అనౌన్స్ మెంట్ ట్రైడెంట్ ఆర్ట్స్, నాద్ స్టూడియోస్ బ్యానర్లతో కలిసి జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దగ్గర పనిచేసిన నీలేష్ కృష్ణా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ బ్యానర్ వారు ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమాలో జై ఇంకా సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.