‘ఏజెంట్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Akhil Agent Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Teaser,Agent Telugu Movie Teaser,Agent Teaser Update,Agent Movie Teaser Release Date Announced, Akhil Akkineni Agent Movie Teaser Release Date Announced,Akhil Upcoming Movie Agent Release Date Announced,Agent Movie Teaser Release Date Fixed, Agent Movie Teaser Release Date Confirmed,Akhil Upcoming Movie Agent Release Date Confirmed

అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అఖిల్ దాదాపు మూడు సినిమాల తర్వాత కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ లో మరో హిట్ ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టే తన మేకవర్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి తాజాగా టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను జులై 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈసినిమా టీజర్ చూసిన తర్వాత భారతదేశం మొత్తం ఏజెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈసినిమాపై మేకర్స్ గట్టి నమ్మకంతోనే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అదే నమ్మకం ప్రేక్షకులకు కూడా రావాలంటే టీజర్ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.