‘పొన్నియన్ సెల్వన్’ ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Aishwarya Rai look from Ponniyan Selvan Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aishwarya Rai,Actress Aishwarya Rai,Aishwarya Rai in Ponniyan Selvan,Aishwarya Rai Movie Updates,Aishwarya Rai latest Movie Updates,Aishwarya Rai Upcoming Movies,Aishwarya Rai New Movie Updates, Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Telugu Movie,Ponniyan Selvan Latest Telugu Movie,Aishwarya Rai and Vikram Ponniyan Selvan,Aishwarya Rai and Vikram, Vikram Ponniyan Selvan Movie Updates,Ponniyan Selvan latest Movie,Ponniyan Selvan Upcoming

చాలా గ్యాప్ తరువాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ తాను సినిమాలకు భిన్నమైన జోనర్ లో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాఉన్నాయి. ఇక ఈసినిమా మొదలుపెట్టిన తరువాత కూడా కరోనా కారణంగా, ఇతర కారణాల వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్, కార్తీ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేయగా..తాజాాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రతీకారానికి అందమైన రూపం.. పజూహూర్ రాణి నందిని క్యారెక్టర్‌‌లో ఐశ్వర్య రాయ్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇంకా ఈసినిమాలో ‘జయం’ రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.