వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వం. ఈసినిమాలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా నక్సల్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. 1990 కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్నారన్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో రానా రవన్న పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి వెన్నెల అనే పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా నక్సల్ నేపథ్యంలో ఉన్నా.. ప్రేమ కథ కూడా ఉందని ఇప్పటికే అర్థమవుతుంది. రవన్న పై వెన్నెలకు ప్రేమ ఎలా కలిగింది.. రవన్నను ఎలా కలుసుకుంది.. తమ ప్రేమను రవన్నకు ఎలా తెలిపింది అనేదే విరాట పర్వం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వెన్నెల పాత్ర నిజ జీవితంలో వరంగల్ కు చెందిన అభ్యుదయవాది సరళ పాత్రే అని తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ సరళ కుటుంబ సభ్యులను కూడా కలిశారు. ఈసినిమా ట్రైలర్ ను వరంగల్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడే వరంగల్ లో విరాట పర్వం చిత్రయూనిట్ సరళ కుటుంబాన్ని పరామర్శించారు. చిత్ర యూనిట్ కు సరళ కుటుంబీకులు ఘనంగా స్వాగతం పలికారు. సరదాగా కాసేపు మాట్లాడారు. అలాగే సరళ గురించిన పలు విషయాలను తెలియజేశారు. అంతేకాదు రీల్ వెన్నెల ను చూసి సరళ తల్లి ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. తన కూతురినే చూసినట్టు ఉందని.. సాయిపల్లవితో కాసేపు ముచ్చటించి కన్నీటి పర్యంతమయ్యారట సరళ తల్లి. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కాగా ఈసినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































