‘మేజర్’.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!

Major Round Table with Mahesh Babu,Major Movie Team Round Table With Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Latest Updates,Major Movie Interviews,Major Movie Round Table With Mahesh Babu,Major Movie Team Round Table Interview With Superstar Mahesh Babu, Major Movie Team Round Table With Mahesh Babu,Mahesh Babu Round Table With Movie Maker Of Team Major,Mahesh Babu Major Movie Updates,Mahes Babu with Major Filmkaers, Superstar Mahesh Babu,Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Major Movie,Adivi Sesh Major Movie Latest Updates

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఇక ప్రివ్యూల నుండే ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈసినిమా కోసం పడిన కష్టానికి ప్రేక్షకులు విజయం అందించడంతో టీమ్ అంతా హ్యీపీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన మహేష్ తో కూడా మేజర్ టీమ్ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ఈసినిమా మేజర్ సందీప్ ఎలా చనిపోయాడన్నది కాదు.. తను జీవించిన విధానం అడివి శేష్ ను ఇన్ప్సైర్ చేసిందని.. దాంతో అలాంటి సూపర్ హీరో సినిమా చేయాలని డిసైట్ అయినట్టు శేష్ తెలిపాడు.

* ఇంకా మహేష్ అలానే నమ్రత మేజర్ టీమ్ ను వెనుకుండి నడిపించారని.. మేజర్ జర్నీలో ప్రతి ఒక్క మూమెంట్ లో వారి సపోర్ట్ చాలా ఉందని తెలిపారు.

* ఈసినిమా మొదట్లో నేను కూడా చాలా నెర్వస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సందీప్ ఉన్ని కృష్ణన్ లాంటి వ్యక్తి బయోపిక్ తీయాలంటే అది చాలా బాధ్యతతో కూడుకున్నది. కానీ సినిమా చూసిన తరువాత అవుట్ పుట్ చూసి థ్రిల్లయ్యానన్నారు. సినిమా ఆఖరి 30 నిమిషాలు మాత్రం చాలా బాగా నచ్చిందని తెలిపారు.

* మేజర్ కథ మొత్తం ఇంకా చాలా డైలాగులు, ఈసినిమా ప్రధాన డ్రైవింగ్ పాయింట్‌ ఇంకా సైనికుడిగా ఉండటం అంటే ఏమిటి? అన్న విషయాలు అన్నీ మేజర్ సందీప్ పేరెంట్స్ చేప్పారని అడివి శేషు తెలిపాడు.

* ఈసినిమాకు నిర్మాతల్లో ఒకరైన శరత్ చంద్ర మాట్లాడుతూ.. ఈసినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ నటీ నటులుగానీ, టెక్నికల్ టీమ్ కానీ అందరూ నిజాయితీగా పనిచేశారని తెలిపారు.

* రాజమౌళి తో సినిమా గురించి మహేష్ ప్రస్తావిస్తూ.. రాజమౌళితో సినిమా చేయడం అనేది ఎప్పటినుండో ఉన్న కల.. త్వరలోనే ఆ కల నిజమవబోతుందని తెలిపారు.

* ఇంకా శరత్ అలానే అడివి శేష్ పై ప్రశంసలు కరిపించారు మహేష్. ప్రమోషన్ క్యాంపెయిన్ లో భాగాంగా ఈసినిమాను ముందుగానే స్క్రీనింగ్ చేయడం లాంటి ఐడియాతో వచ్చారు. దీనివల్ల వారికి సినిమాపై ఎంత నమ్మకం ఉందన్నది అర్థమవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.