అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కె.జి.యఫ్. 2018లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా రిలీజ్ అయ్యే సమయానికి నిజానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. కానీ ఎప్పుడైతే కె.జి.యఫ్ సినిమా రిలీజ్ అయిందో ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత టాలీవుడ్ హీరోల దృష్టి కూడా ప్రశాంత్ నీల్ పై పడింది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశం దక్కింది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. వీరితో పాటు రామ్ చరణ్, బన్నీ లతో కూడా త్వరలో సినిమాలు చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. నిజానికి కె.జి.యఫ్ సక్సెస్ తరువాత అక్కడ కన్నడలో ఉన్న స్టార్ హీరోలతో అవకాశాలు రావాల్సింది.. కానీ ప్రశాంత్ నీల్ అదృష్టం.. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ కూడా టాలీవుడ్ హీరోలతో చేయడానికి కారణం ఏంటో చెబుతున్నాడు. కె.జి.యఫ్ సినిమా సక్సెస్ తరువాత నన్ను ఫస్ట్ అభినందించింది టాలీవుడ్ స్టార్సే.. మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ అభినందించారు.. అది నేను ఊహించలేదు కూడా.. యంగ్ టాలెంట్ ను ప్రోత్సాహించడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది అని తెలిపారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ రేంజ్ మరింత పెరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కె.జి.యఫ్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమా కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందిస్తే.. మరోవైపు మంచి ఫలితాన్ని అందించి చిత్రయూనిట్ కు కూడా ఊరట కలిగించారు. ప్రస్తుతం అయితే సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈసినిమా. ఈ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. చూద్దాం మరి ప్రభాస్ కు ఎలాంటి సినిమా ఇస్తాడో ప్రశాంత్ నీల్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























