టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్నారు. ఇక ఈసినిమాను గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు కానీ ఇంతవరకూ మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక తాజాగా నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. ఈ రోజు చెన్నైలో నటీనటులు, సిబ్బంది మధ్య సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక మందన్న, మ్యూజిక్ కంపోజర్ తమన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. ప్రస్తుతానికి విజయ్66 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Elated to kick start the ambitious#Thalapathy66 with a Pooja ceremony in Chennai @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_official @Cinemainmygenes #Thalapathy66Launched pic.twitter.com/3Z6Rev7fbi
— Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2022
కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ కు జోడీగా ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో ఉన్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























