ఈమధ్య కాలంలో స్పార్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడానికి హీరోలు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బాక్సింగ్, కబడ్డీ, క్రికెట్, హాకీ ఇలా చాలా జోనర్లలో సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో క్రీడానేపథ్యంలో సినిమా రాబోతుంది. విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా సినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ సమర్పణలో హీరో విష్ణు విశాల్ నటించిన చిత్రం `ఎఫ్ఐఆర్` కమర్షియల్ హిట్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రవితేజ, విష్ణు విశాల్ కలిసి టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై కలిసి ఈ రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. `మట్టి కుస్తి` అనే టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్లో ప్రేక్షకులతో నిండిన ఆట స్థలం కనిపిస్తుంది. టైటిల్ సూచించినట్లుగా, మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా రూపొందించబడింది.
I always love films centered around sports 🙂
Happy to present such a sports drama which is high on entertainment .
Here’s #MattiKusthi Motion Poster !@TheVishnuVishal @RTTeamWorks @ChellaAyyavu @VVStudioz pic.twitter.com/1YutNmIwZX
— Ravi Teja (@RaviTeja_offl) April 5, 2022
కాగా ఈసినిమాలో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. కాాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నదని మేకర్స్ తెలియజేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: