సమంత ‘యశోద’ రిలీజ్ డేట్ ఫిక్స్

Samantha’s Action Thriller Yashoda Release Date Locked!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Samantha Upcoming Movies,Samantha new Movies,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Action Thriller Yashoda,Samantha Yashoda Movie,Samantha Upcoming Movie Yashoda, Samantha New Movie Yashoda,Yashoda Movie Release Date Locked,Yashoda New Movie Release Date fixed,Yashoda Movie Release Date Confirmed,Samantha Yashoda Movie Release Date Confirmed,Yashoda MovieOn August 12th, Yashoda Movie Releasing on August 12th,Samantha Yashoda Movie On August 12th,Samantha Yashoda Movie Relase Date Locked on 12th August

సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ గా చేసిన ‘యూ టర్న్’ అలానే ‘ఓ బేబీ’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా సమంత యశోద అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హరి – హరీష్ ఈసినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈసినిమా కూడ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 2 =