అఫీషియల్.. వంశీ-విజయ్ సినిమాలో రష్మిక..!

Rashmika Mandanna Onboard for Thalapathy Vijay Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday Rashmika,HBD Rashmika,Rashmika Birthday,Actress Rashmika Birthday,Rashmika Upcoming Movies,Rashmika Roped in for Vijay New Movie,Actress Rashmika Roped In For Vijay Starrer Thalapathy 66, Pushpa Actress Rashmika Roped in For Vijay new Movie Thalapathy 66,Thalapathy 66,Vijay Upcoming Movies,Vijay New Movie Thalapathy 66,Vijay Latst Movie Updates,Rashmika with Vijay upcoming Movie Updates

‘ఛ‌లో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ రష్మిక. ఈసినిమా మంచి హిట్ అవ్వడంతో ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రష్మికకు. ఆసినిమా తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ‘గీతా గోవిందం’ సినిమాలో న‌టించింది. ఇక ఈసినిమాతో రష్మిక రేంజ్ మరింత పెరిగింది. మధ్యలో వచ్చిన దేవదాసు ఓ మోస్తరు విజయం అందుకోగా.. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. అయినా కూడా రష్మిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. ఇక తర్వాత వరుసగా ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’, ‘భీష్మ’ వంటి వ‌రుస హిట్టు సినిమాల‌తో స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిన రష్మిక గతేడాది వ‌చ్చిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో క్రేజ్ సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. మరోవైపు తాజాగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలో హిరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరో స్టార్ కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా స్ట్రైయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో హీరోయిన్ గా రష్మికను ఫిక్స్ చేశారు. నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈసినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 18 =