మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. ఇటీవల హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించాడు. ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా ప్రారంభించే లోపే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబరులో బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకొని ఆతరువాత డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆతర్వాత ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు తన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకునేవాళ్లు. ఇక ఇప్పుడు సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈనేపథ్యంలో తను మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అయ్యాడు.
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతన్న సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సాయి తేజ్ కు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. ఆయనకు పూలాభిషేకంతో యూనిట్ సభ్యులు స్వాగతం పలికారు. ఇక వెల్ కమ్ వీడియోను చిత్రయూనిట్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Here’s inviting our Supreme Hero @IamSaiDharamTej with a surprise welcome from the cast & crew as he joins the sets of #SDT15 for the first day of shoot.
▶️ https://t.co/ivVv212yBc#WelcomeBackSDT@karthikdandu86 @aryasukku @SukumarWritings @SVCCofficial pic.twitter.com/fuCup7POqq
— SVCC (@SVCCofficial) March 29, 2022




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























