బ్లాక్ బస్టర్ “మైనే ప్యార్ కియా” హిందీ మూవీ తో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి స్టార్ డమ్ పొందారు. ఆ తరవాత పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల “తలైవి” తమిళ మూవీ లో నటించిన భాగ్యశ్రీ.. ఇప్పుడు “రాధే శ్యామ్” మూవీ లో హీరో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. “రాధేశ్యామ్” మూవీ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ పెళ్లయ్యాక సినిమాలకు దూరం అయ్యాననీ , అప్పట్లో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ, ఇల్లు – పిల్లలతో కుదర్లేదనీ , ఇప్పుడు మా పిల్లలే సినిమాలు చేయమని ప్రోత్సహిస్తున్నారనీ , “తలైవి”, “రాధేశ్యామ్’” మూవీస్ కు ఒకేసారి కమిట్ అయ్యాననీ , అయితే పాండమిక్ వల్ల “రాధేశ్యామ్” ఆలస్యమైందనీ , ఇదో పాన్ ఇండియా సినిమా అనీ , ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలనే కదా ఎవరైనా కోరుకునేదనీ , ప్రభాస్ గొప్ప స్టార్. తను పాన్ ఇండియా హీరో. కానీ ఆ గర్వం కాస్త కూడా తనలో కనిపించదనీ , తన చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటాడనీ , అందరినీ కుటుంబ సభ్యుల్లా చూస్తాడనీ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. దేశం మొత్తం తెలుగు చిత్రాలవైపే చూస్తోందనీ , ఇక్కడ మంచి చిత్రాలు రూపొందుతున్నాయనీ ,తాను ఇప్పుడు టాలీవుడ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందనీ , ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ భాగ్యశ్రీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































