మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో అద్భుతమైన రెస్పాన్స్ పొందిన విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఈ మూవీ ని ఆదరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప” మూవీ సెకండ్ పార్ట్ “పుష్ప: ది రూల్ ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. “పుష్ప: ది రూల్ ” మూవీ కంటే ముందుగా మరో మూవీ ని అల్లు అర్జున్ అనౌన్స్ చేయాలనుకున్నారు. ఫస్ట్ పార్ట్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించి తనకు బాలీవుడ్ లో మార్కెట్ పెరిగినందుకు మరో బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని ” పుష్ప 2″ మూవీ లో నటించడానికి అల్లు అర్జున్ డిసైడ్ అయ్యారు. “పుష్ప: ది రైజ్” మూవీ 2021డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించడంతో “పుష్ప :ది రూల్ “మూవీ ని 2022 డిసెంబర్ 17 వ తేదీ రిలీజ్ చేయడానికి దర్శకుడు సుకుమార్ , హీరో అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నారు. “పుష్ప 2” పై మాట్లాడుతూ ఈ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్ చేయనన్ని భాషల్లో రిలీజ్ చేస్తామనీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సగర్వంగా ప్రకటించిన విషయం తెలిసిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























