సక్సెస్ ఫుల్ “జై “మూవీ తో నవదీప్ టాలీవుడ్ , కోలీవుడ్ లకు హీరోగా పరిచయం అయ్యారు. “గౌతమ్ ఎస్ ఎస్ సి “, “చందమామ “, “ఆర్య 2”, వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నవదీప్ “ధృవ “, “నేనే రాజు నేనే మంత్రి “, “అల .. వైకుంఠపురములో .. “, “మోసగాళ్ళు”వంటి మూవీస్ లో కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ , పంఖురి గిద్వానీ జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. నవదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు ”లవ్ మౌళి” అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు.రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా ”లవ్ మౌళి” టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. బాయ్స్ అండ్ గర్ల్స్.. బోల్డ్ డీప్ కలర్ ఫుల్ మౌలీని పరిచయం చేస్తున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ నవదీప్ 2.0. స్క్రీన్ మీద ఈ మ్యాడ్నెస్ ని అన్వేషించడానికి వేచి ఉండలేను అంటూ రానా ట్వీట్ చేశారు. నవదీప్ 2.0 ని పరిచయం చేస్తున్న ”లవ్ మౌళి” టైటిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. నవదీప్ ఇందులో సరికొత్త గెటప్ లో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని అవతార్ లో ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: