టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. ఇటీవలే శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఆయనఆరోగ్యం కాస్త విషమంగానే ఉందంటూ వార్తలు వచ్చాయి. తన భార్య.. అలానే పెద్దకుమారుడు కూడా కరోనా బారిన పడగా.. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనాతో పోరాడుతున్నారు. మరోవైపు ఆర్దికభారం పడటంతో సోనూసూద్ దగ్గర నుండి మా అధ్యక్షుడు మంచు విష్ణు. చిరు తో పాటు పలువురు సెలబ్రిటీలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. ఇక శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల ఇండస్ట్రీ మొత్తం విచారం వ్యక్తం చేస్తుంది. ఇక మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డిసెంబర్ 7, 1948న చెన్నైలో జన్మించారు శివశంకర్ మాస్టర్. మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్ ఆతర్వాత తానే స్వయంగా కొరియోగ్రఫర్ గా మారారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో భాషల్లో 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాదు.. పలు సినిమాల్లో నటించారు కూాడా.
కాగా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ‘ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గారు మరణించారని తెలిసి బాధగా ఉంది. ‘మగధీర’ కోసం ఆయనతో కలిసి పనిచేయడం నా జీవితంలో మరపురాని అనుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని రాజమౌళి ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు.
Sad to know that reknowned choreographer Shiva Shankar Master garu has passed away. Working with him for Magadheera was a memorable experience. May his soul rest in peace. Condolences to his family.
— rajamouli ss (@ssrajamouli) November 28, 2021
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























