జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “బంగార్రాజు ” మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. తన డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరియా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ సార్ తో కలసి డ్యాన్స్ చేయడానికి ఆసక్తి తో ఎదురుచూస్తున్నా నని ఫరియా చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























