కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణించినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతిరోజూ ఎంతో మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు అంటేనే చెప్పొచ్చు పునీత్ అంటే ఎంత అభిమానమో. ఇక అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన కుటుంబాన్నిపరామర్శిస్తూ కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఇక తాజాాగా టాలీవడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ కూడా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబాన్ని పరామర్శించి వారికి సంతాపం తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Paid Conolence to Puneet Sir Family in Banguluru. RIP. Live you sir 🙏@PowerStarPunith pic.twitter.com/hTjBwit8Fq
— BANDLA GANESH. (@ganeshbandla) November 15, 2021
కాగా బండ్ల గణేష్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆమధ్య రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉండగా ఆ తర్వాత రాజకీయాల నుండి బయటకు వచ్చి మళ్లీ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. యస్రిషి ఫిల్మ్స్ పతాకంపై స్వాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























