సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. నవంబర్ చివరికి సినిమా షూటింగ్ పూర్తి చేసి, చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటుంది.రీసెంట్ చిట్ చాట్ లో థమన్ ను ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ వయొలిన్ స్కిల్స్ అందిస్తారని థమన్ ఎస్ చెప్పారు. టాలెంటెడ్ వయొలిన్ ప్లేయర్ అయిన కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ తన వయొలిన్ స్కిల్స్ ను “సర్కారు వారి పాట”మూవీ కి అందించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: