మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ , ఫాహద్ ల యాక్షన్ సీన్స్ “పుష్ప “మూవీ కి హైలైట్ కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన లో చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.సౌత్ ఇండియాలో 24 గంటల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 10.2 మిలియన్ వ్యూస్‌ని ఈ సాంగ్ రాబట్టడమే కాకుండా ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























