సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Superstar @rajinikanth‘s #పెద్దన్నTeaser is here:
▶ https://t.co/bP3gdZa1Xt@directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @prakashraaj @IamJagguBhai @khushsundar #Meena @sooriofficial @actorsathish @AntonyLRuben @dhilipaction @vetrivisuals
— Sun Pictures (@sunpictures) October 23, 2021
ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి రజినీ ఈమధ్య సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా ఏ మేరకు విజయం అందిస్తుందో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























