నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్రబృందం.
ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రానా దగ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను ఇంకా పెంచేసింది.
Here’s the glimpse into the world full of Joy ~ #VaruduKaavalenuTrailer 💚😍
in Theatres from 29th Oct 2021! ✨@IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @vamsi_p1988 @NavinNooli @adityamusic pic.twitter.com/9eDHlnsEXi
— Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021
కాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































