జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2022 సంవత్సరం సంక్రాంతి పండగ కి రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల “రౌద్రం రణం రుధిరం “, మహేష్ బాబు “సర్కారు వారి పాట”, ప్రభాస్”రాధేశ్యామ్ “, పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్ ” రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండగ తోపాటు ప్రేక్షక, అభిమానులకు సినిమా పండగ కూడా. నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ 2016 జనవరి 15 రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ సెంటిమెంట్ తో “బంగార్రాజు “మూవీ ని జనవరి 15 వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























