సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేస్తుంది. అందుకే హీరో సాయి తేజ్ లేకపోయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈట్రైలర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తాజాగా దీనిపై ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ కూడా స్పందించి ప్రశంసలు కురిపించారు. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సినిమా ట్రైలర్ పై స్పందించి ట్రైలర్ అదిరింది.. అప్పుడు ప్రస్థానం ఇప్పుడు రిపబ్లిక్.. దేవకట్టా కి యూనిక్ వాయిస్ ఉంది సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.
అప్పుడు ప్రస్థానం ఇప్పుడు Republic! Dev has a strong unique voice! Trailer అదిరింది! Looking forward to the film. Good luck @devakatta and team! https://t.co/uxN2ey6DGm
— Raj & DK (@rajndk) September 23, 2021
ఇంకా ఈసినిమాలో రమ్యకృష్ణ, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























